మలన్న సేవలో కర్ణాటక గవర్నర్
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:39 PM
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంగళవారం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు.

శ్రీశైలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంగళవారం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కర్ణాటక గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈవో స్వామివార్ల చిత్రపటాన్ని అందజేశారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శ్రీశైలం పర్యటించనున్న సందర్భంగా మంగళవారం నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, శ్రీశైలం సీఐ జి. ప్రసాదరావు ఉన్నారు.