కలెక్టర్ల సమావేశానికి హాజరైన రాజకుమారి
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:41 PM
రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి హాజరయ్యారు.

నంద్యాల నూనెపల్లె, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బుధవారం సీఎం చంద్రబాబుకు నంద్యాల జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ వివరించనున్నారు. జిల్లాలో సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను ఆమె సీఎంకు దృష్టికి తీసుకురానున్నారు.