Share News

జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్‌ కల్పించాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:09 AM

చట్టసభల్లో బీసీ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్‌ కల్పించాలి
నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాన్ని అందజేస్తున్న నాగేశ్వరరావు యాదవ్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో బీసీ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, బీసీలకు పార్టీ పదవుల్లో నామినేటెడ్‌ పదవులు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర యాదవ్‌, నాయకులు బెస్త గ్యాస్‌ శ్రీనివాసులు, శకుంతల, భారతి, కురువ శ్రీనివాసులు, వాడాల నాగరాజు, పీజీ వెంకటేశ్‌, పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా ఉపాధ్యక్షుడిగా కుమ్మరి రామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కుమ్మరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శిగా కె.శ్రీనివాసులు, కోశాధికారిగా కె.బజారన్న, జిల్లా సహాయ కార్యదర్శులుగా గిరిబాబు, రవికుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నాగార్జున, జిల్లా కార్యదర్శిగా రేణుక, ఉపాధ్యక్షులుగా బి.రాధ, లింగన్న ఎన్నికయ్యారు.

Updated Date - Mar 24 , 2025 | 12:09 AM