ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:45 AM
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన గౌరు దంపతులు
కల్లూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లూరు అర్బన 16 వార్డుల పరిధిలోని ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గౌరు దంప తులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 195 అర్జీలు వచ్చాయని ఎమ్యెల్యే తెలిపారు. కార్యక్రమంలో పెరుగు పురు షోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీలోనే కార్యకర్తలకు భరోసా: తెలుగుదేశం పార్టీలోనే నాయ కులు, కార్యకర్తలకు భరోసా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారం కల్లూరు, ఓర్వకల్లు మండల బూత, క్లస్టర్ యూనిట్ ఇనచార్జిలతో గౌరు దంపతులు సమావేశం నిర్వ హించారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గం లో సభ్యత్వ నమోదును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికి ఇంకా సభ్యత్వ నమోదుకు అవకాశం ఉన్నచోట కార్యకర్తలు చురుకుగా పాల్గొని సభ్యత్వ నమోదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్డులను క్లస్టర్, యూనిట్ ఇనచార్జిలకు అందజేశారు. కార్యక్రమంలో డి.రామాంజనేయులు, ఈవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.