Share News

వృద్ధిరేటు పెరగాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:51 PM

జిల్లా వృద్ధిరేటు 15శాతం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి నివాస్‌ అధికారులను ఆదేశించారు.

వృద్ధిరేటు పెరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న నివాస్‌

ప్రణాళికలు రూపొందించండి

ప్రత్యేక అధికారి నివాస్‌

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వృద్ధిరేటు 15శాతం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి నివాస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్‌హాల్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల జాతీయోత్పత్తి 15 శాతం వృద్ధిరేటుపై కలెక్టర్‌ రాజకుమారితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నివాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధికి 15శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్లాలని సూచించారన్నారు. గతేడాది జిల్లా గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డెమోస్ట్రిక్‌ ప్రాడక్ట్‌గా రూ.43,630 కోట్లుగా ఉందని, ఈ ఏడాది వ్యవసాయ, వాటి అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా రూ.50,726కోట్లకుపైగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు తక్కువ ఖర్చుతో అధికలాభం వచ్చేలా దృష్టిపెట్టాలన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధికశాతం ఉద్యానపంటల విస్తరణతోపాటు సోయాబీన్‌, పండ్లతోటల అభివృద్ధిచేస్తే వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఒకేపంటకు పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌కు సంబంధించి జిల్లాలోని 13 సమ్మర్‌ స్టోరేజ్‌ట్యాంక్‌లను పూర్తిస్థాయిలో నింపేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:51 PM