Tirumala: అలిపిరి నడకదారిలో చిరుత
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:53 AM
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది.

తిరుమల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. గాలిగోపురం వద్ద తెల్లవారు జామున 1.09 గంటల సమయంలో ఓ దుకాణానికి సమీపంలో పిల్లిని నోట కరుచుకుని అడవిలోకి పరుగులు తీసింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు కనిపించాయి. అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.