రక్షిత నీటి పథకాలకు మహర్దశ
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:33 PM
ఎన్నో దశాబ్దాల నుంచి గ్రామాలలో కోట్లు వెచ్చించి నిర్మాణం చేసిన రక్షిత మంచి నీటి పథకాలు ఆలంకారంగా ఉన్నాయి. నిధుల లేమితో పథకాలు పనిచేయకుండానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి శుభ్రం చేసిన కొళాయి నీటిని అందించేలా అడుగులు పడుతున్నాయి. అందుకు గాను జలజీవన్ మిషన్ ద్వారా బల్లికురవ మండలానికి రూ.8.50కోట్లు మంజూరయ్యాయి.

ఎన్నో దశాబ్దాల నుంచి నిరుపయోగం
జలజీవన్ మిషన్ ద్వారా మరమ్మతులకు నిధులు
బల్లికురవ మండలంలో 21 వర్కులకు రూ.8.50కోట్లు మంజూరు
తాగునీటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మంత్రి రవికుమార్ కృషితో అన్ని గ్రామాలలో ఇంటింటికీ కొళాయి నీరు ఇచ్చేలా ప్రణాళికలు
బల్లికురవ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో దశాబ్దాల నుంచి గ్రామాలలో కోట్లు వెచ్చించి నిర్మాణం చేసిన రక్షిత మంచి నీటి పథకాలు ఆలంకారంగా ఉన్నాయి. నిధుల లేమితో పథకాలు పనిచేయకుండానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి శుభ్రం చేసిన కొళాయి నీటిని అందించేలా అడుగులు పడుతున్నాయి. అందుకు గాను జలజీవన్ మిషన్ ద్వారా బల్లికురవ మండలానికి రూ.8.50కోట్లు మంజూరయ్యాయి. అర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు గ్రామాలలో రక్షిత నీరు అందిచేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. టెండర్లు ఈ మాసంలో పూర్తి అయి ఏప్రిల్ నుంచి గ్రామాలలో పనులు ప్రారంభం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బల్లికురవ మండలంలో అత్యధిక గ్రామాలలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయి. గత కొన్నేళ్ల కిందట పలు గ్రామాలలో రక్షిత మంచి నీటి పథకాలు కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన అవి స్వల్ప మర్మమ్మతులతో నిరుపయెగంగా ఉన్నాయి. దీంతో ప్రజలు తాగు నీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో నిరుపయెగంగా మంచి నీటి పథకాలను వినియెగంలోకి తెచ్చే లా జలజీవన్ మిషన్‌లో రూ.8.50కోట్లను మంజూరు చేయించారు. ఈ నిధులతో గ్రామాలలో ఉన్న రక్షిత నీటి పథకాల పైపులైన్లు, ట్యాంకులు, ఇంటింటికీ కొళాయిలు వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాలలో అధికారులు పర్యటించి గ్రామాలలో అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి పంపగా నిధులు మంజురయ్యాయి. బల్లికురవ మండలంలో 21 వర్కులకు టెండర్లు కూడా ఈ నెలలో జరగనున్నాయి. రానున్న నెల లో గ్రామాలలో రక్షిత నీటి పథకాల మరమ్మతులకు జలజీవన్ మిషన్ పథకంలో పను లు ప్రారంభం కానున్నాయి.
బల్లికురవ మండలానికి నిధులు మంజూరు
జలజీవన్ మిషన్ ద్వారా బల్లికురవ మండలంలో ఉన్న రక్షిత మంచి నీటి పథకాలను వినియెగంలోకి తెచ్చేలా ప్రభు త్వం రూ. 8.50కోట్ల నిధులను 21 వర్క్‌లకు కేటాయించింది. పెద అంబడిపూడికి రూ.25లక్షలు, సూరేపల్లికి రూ.18లక్షలు, వైదనకు 46 లక్షలు, వెలమవారిపాలెంకు రూ.51లక్షలు, వేమవరానికి రూ.57.5 లక్షలు, గుంటుపల్లికి రూ.18.9లక్షలు, కొండాయపాలెంకు రూ.21 లక్షలు, చెన్నుపల్లికి రూ.65లక్షలు, గొర్రెపాడుకు రూ.11.2 లక్షలు, జమ్మలమడకకు రూ.27లక్షలు, కె.రాజుపాలెంకు రూ.40 లక్షలు, కొమ్మినేనివారిపాలెంకు రూ.39.8లక్షలు, కొణిదెనకు రూ.52 లక్షలు, కొత్తూరుకు రూ.21 లక్షలు, కొప్పెరపాలెంకు రూ.1.8 కోట్లు, కూకట్లపల్లికి రూ.31లక్షలు, ముక్తేశ్వరానికి రూ.36లక్షలు, నక్కబొక్కలపాడుకు రూ.97లక్షల నిధు లు మంజూరయ్యాయి.