Share News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:39 PM

మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీన మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయ తీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామంలో ఏన్టీఆర్‌ భరోసా పింఛన్‌లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయన పర్యటన విజయవంతం అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు ఇస్తున్న చీరాల డీఎస్పీ మొయిన్‌

చినగంజాం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీన మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయ తీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామంలో ఏన్టీఆర్‌ భరోసా పింఛన్‌లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయన పర్యటన విజయవంతం అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు అన్ని శాఖల అధికారులు బృందాలుగా ఏ ర్పడి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. హెలిపాడ్‌, బహిరంగసభ, అధికారులతో నిర్వహించే సభా స్థలాల్లో ఉన్న, గ్రామంలోని రోడ్ల వెంబడి ఉన్న చిల్లచెట్లను ఎక్స్‌కవేటర్‌తో పీకిస్తున్నారు.

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు త్రీవముగా కృషి చేస్తున్నారు. చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్‌నాయుడు, చీరాల డీఎస్పీ మహమ్మద్‌ మెయిన్‌, పలు శాఖలకు చెందిన ఉన్నాతాధికారులు తమ సిబ్బందికి పలు సూచనలు ఇస్తున్నారు. మూరుమూల గ్రామైన ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో గ్రామస్థులు కూడా పూర్తి సహకారంతో పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అందరూ సిద్ధమ వుతున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:39 PM