తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:41 AM
వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లే కుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశించారు. శుక్రవారం ఒంగోలులోని తన నివాసంలోని క్యాంపు కార్యాలయంలో నగర పాలక సంస్థ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమా వేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే దామచర్ల
ఒంగోలు కార్పొరేషన్, మార్చి 21 (ఆంధ్రజ్యో తి): వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లే కుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశించారు. శుక్రవారం ఒంగోలులోని తన నివాసంలోని క్యాంపు కార్యాలయంలో నగర పాలక సంస్థ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ నగరంలో పైపులైను లీకులపై దృష్టి సారించాలన్నారు. అలాగే శివారుకాలనీల్లో తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా స కాలంలో నీరు అందించాలని ఆదేశించారు. గుం డ్లకమ్మ నీరు వేసవి చెరువులకు విడుదలవుతు న్న నేపథ్యంలో నీటికి ఇబ్బందులు ఉండబోవని, అయితే సరఫరాలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవా లని చెప్పారు. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి మొదలయ్యే నీటి సరఫరా రాత్రి పది గంటలలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూ చించారు. అర్ధరాత్రి నీటి సరఫరా విధానానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అలాగే ఫిల్టర్ బెడ్‌లు, పంప్‌హౌస్‌లో మోటారు సమస్యలు లే కుండా చూడాలని పేర్కొన్నారు. నగరంలోని చేతి పంపులు (బోరింగ్)లును వినియోగంలోకి తీ సుకురావాలని చెప్పారు. అలాగే నగర సుందరీక రణ, రహదారుల విస్తరణ పనులపై పలు వివ రాలను కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే అ డిగి తెలుసుకున్నారు. అలాగే ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలంలో తాగునీటి ఎద్దడి రాకుం డా చూడాలన్నారు. గ్రామాల్లోని చెరువులను విని యోగంలోకి తీసుకురావాలని, అలాగే రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని దామచర్ల కోరారు. అదేవిధంగా పలు శాఖల అధి కారులతో ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహించారు.
పేదల ఆరోగ్యానికి భరోసా..
సీఎం సహాయనిధితో పేదల ఆరోగ్యానికి భరో సా లభిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పే ర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్ కింద 29 మందికి మం జూరైన రూ.27.56 లక్షల చెక్కులను శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో లబ్ధిదారులకు అందజే శారు. పేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
నగర సమస్యలపై దృష్టి సారించాలి
నగర పరిధిలోని సమస్యలపై కార్పొరేటర్లు దృష్టి సారించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. శుక్రవారం స్థానిక బీకే ఎన్‌క్లేవ్‌లోని దామచర్ల క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్‌లలో పైపులైన్ లీకులు, పా రిశుధ్యంపై ఫిర్యాదుల రాకుండా చూడాలన్నారు. త్వరలోనే నగరంలోని పలు రహదారుల విస్తరణ దిశగా ప్రణాళిక రూపొందిస్తామని, కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజి, పలు వురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
హాస్టల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలి
ఒంగోలులో నూతనంగా ప్రతిపాదించిన వస తి గృహాల నిర్మాణాలకు త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాంఘీక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్‌ను ఆ దేశించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సాంఘీక సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌కు రూ.6 కోట్లు మంజూరు అయినందున దామచర్ల పాలి టెక్నిక్ కాలేజీలో గుర్తించిన స్థలంలో టెండర్లు పి లిచి పనులు ప్రారంభించాలన్నారు. అలాగే తూ ర్పుపాలెంలో రూ.3.7కోట్లు, మరో రూ.3కోట్లుతో పీవీఆర్ బాలుర స్కూలు దగ్గర కార్పొరేషన్ స్థ లంలో భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాల ని ఆదేశించారు.