Share News

plots allotment ప్రతి ఒక్కరికీ ప్లాట్‌ వచ్చేందుకు కృషి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:56 PM

plots allotment ప్ర తి ఒక్కరికీ ప్లాట్‌ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారని ఎమ్యెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో ఎంఐజీ లే అవుట్‌-1లో 240 చదరపు గజాల ప్లాట్ల కు బుధవారం కాశీబుగ్గలో ఓ కల్యాణ మండపంలో డ్రా తీశారు.

plots allotment  ప్రతి ఒక్కరికీ ప్లాట్‌ వచ్చేందుకు కృషి
లబ్ధిదారులకు పట్టా అందిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

కాశీబుగ్గ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్ర తి ఒక్కరికీ ప్లాట్‌ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారని ఎమ్యెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో ఎంఐజీ లే అవుట్‌-1లో 240 చదరపు గజాల ప్లాట్ల కు బుధవారం కాశీబుగ్గలో ఓ కల్యాణ మండపంలో డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ లేఅవుట్‌లో పాట్‌రాని వారికి లేఅవుట్‌-2లో అవకాశం కల్పి స్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మరో 10 రోజుల్లో లేఅవుట్‌-2లో డ్రా తీస్తార న్నారు. లబ్ధిదారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారన్నారు. మధ్యా హ్నం 200, 150 చదరపు గజాల ప్లాట్లను డ్రా తీశారు. డ్రాలో ఎంపి కైన వారికి త్వరలో సమా చారం అందించి మిగిలిన ప్రక్రియ చేపడతామని సుడా అధికారులు పేర్కొ న్నారు. కార్యక్ర మంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, సుడా పీవో అమర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి

పలాసరూరల్‌,మార్చి26(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు సమయాన్ని వృథా చేయకుం డా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వెలుగు కార్యాలయంలో ఫ్యూజన్‌ ఫైనాన్స్‌, బ్లూస్టార్‌, యూనీఛార్మ్‌ కంపెనీల ఆధ్వ ర్యంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్‌మేళాల్లో అర్హులైన వారు ఉద్యో గం సాధించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. జాబ్‌మేళాకు 72మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఐడీఎంఎ ఎస్‌.రమణమూర్తి, డీపీ ట్రైనర్‌ కె.కవిత, జేసీవో ఎల్‌. నాగేశ్వరరావు, పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, ఏపీఎం కె.జాంభవతి పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:56 PM