ముగిసిన నాటికలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:03 AM
సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ఆది వారం బాపూజీ కళామందిర్‌లో తాడేపల్లి వారికి చెందిన గంగోత్రి సాయి దర్శకత్వంలో ‘విడాకులు కావాలి‘ నాటిక ప్రదర్శించారు.

శ్రీకాకుళం కల్చరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ఆది వారం బాపూజీ కళామందిర్‌లో తాడేపల్లి వారికి చెందిన గంగోత్రి సాయి దర్శకత్వంలో ‘విడాకులు కావాలి‘ నాటిక ప్రదర్శించారు. అదేవిధంగా విశా ఖ ఉక్కు నగరానికి చెందిన పి.బాలాజీ నాయక్ దర్శకత్వం లో ‘అసత్యం‘ సాంఘిక నాటికలు ఆహుతలను ఆకట్టుకు న్నాయి. నాటికలు అనంతరం సినీటీవి నటుడు జబర్దస్త్ అప్పారావు ఆధ్వర్యంలో హాస్యవల్లరి ప్రదర్శన ఆహుతలను కడుపుబ్బా నవ్వించింది. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్ శర్మ, గుత్తూ చిన్నారావు, పులఖండం శ్రీనివాసరావు, నక్క శంకరరావు, పార్ధసారథి, వరలక్ష్మి, ఉషారాణి, పూజ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.