Share News

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందించాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:41 PM

నియోజక వర్గంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందిం చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందించాలి
వినతులు స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు 

కోటబొమ్మాళి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందిం చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో నియో జకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లోని 497 గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరం దిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నా రు. అందు లో భాగంగా రూ.97 కోట్లు మంజూరై నందున పనులు పూర్తి చేసే లా అవసరమైన అన్ని చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. నియోజకవర్గం లోని నీటి పథకాలు, వాటి పరిస్థితిని అధికారు లను అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి నీటి సమస్య లేకుండా చూడా లని, అవసర మైతే బోర్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రులు భాషా, రామకృష్ణ, పీఏసీస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, బోయిన రమేష్‌ తదిత రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదు లను పరిష్కరించడంలో అధికా రులు శ్రద్ధ తీసుకో వాలని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యలు విన్నవించుకున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:41 PM