Share News

పలాస అభివృద్ధి కావాలంటే ఎయిర్‌పోర్టుకు సహకరించండి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:55 PM

పలాస అభివృద్ది కావాలంటే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహ కరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

పలాస అభివృద్ధి కావాలంటే ఎయిర్‌పోర్టుకు సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పలాస అభివృద్ది కావాలంటే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహ కరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వలసలు వెళ్లిపోతున్నారని, ఇక్కడే ఎయిర్‌ పోర్టు ఉంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, భవిష్య త్‌ తరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు కావాలని జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యే లు కోరుతున్నారని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు పలాస అభివృద్ధిని కాంక్షించి ఇక్కడే ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. అభి వృద్ధి చేద్దామంటే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, అయితే ఆ నాయకులు గత ప్రభుత్వ హయాంలో కొండ లు దోచుకున్నా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కార్యక్ర మంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీ కృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌ రావు, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి లొడగల కామేశ్వర రావుయాదవ్‌, నేతలు గాలి కృష్ణారావు, గురిటి సూర్య నారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్‌, కార్యదర్శి టంకాల రవి శంకర్‌గుప్తా, కోట్ని దుర్గా ప్రసాద్‌, దువ్వాడ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి సహకరించండి
పలాసరూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
రానున్న విద్యాసంవత్సరంలో ప్రతి పంచాయతీలో మోడల్‌ పాఠ శాల ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో వజ్రపుకొత్తూ రు, పలాస మండలాల ఎంఈవోలు, ఉపాధ్యాయులు, స్కూల్‌ కమిటీ చైర్మన్లతో ఆదివారం సమావేశం నిర్వ హించారు. కార్యక్రమంలో ఎంఈవోలు శ్రీనివాస రావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:55 PM