రోడ్డు ప్రమాదంలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:51 PM
ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్‌కు సమీపంలో పాత జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ప్రమా దంలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ మృతిచెందాడు.

ఎచ్చెర్ల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్‌కు సమీపంలో పాత జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ప్రమా దంలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ మృతిచెందాడు. రణస్థలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం నగరానికి చెందిన దేవరాజు వెంకట కిరణ్‌కుమార్ (40) ఎచ్చెర్లలోని నివాసం ఉంటు న్నారు. ఎచ్చెర్ల నుం చి ప్రతిరోజూ రణస్థలానికి రాకపోకలు సాగిస్తున్నారు. రోజు వలే ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఇంటి నుంచి రణస్థలం వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. రాజాం నుంచి వత్సవలస ప్రయాణికులతో వెళ్తున్న మ్యాజిక్ వ్యాన్.. కిరణ్ కుమార్ తన ద్విచక్ర వాహ నంపై మలుపు తిరుగుతుండగా ఢీకొంది. ఈ ఘటనలో కిరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. గతంలో కిరణ్‌కుమార్ ఎచ్చెర్ల పీహెచ్‌సీలో పనిచేసి, సుమా రు మూడేళ్ల కిందట రణస్థలం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు బదిలీ అయ్యా రు. కిరణ్‌కు భార్య స్వప్నకుమారి, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి..
ఆమదాలవలస, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైల్వే అండర్ పాసేజ్ వంతెన వద్ద ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రైల్వే ఉద్యోగి జరజాన కృష్ణ(57) మృతి చెందినట్టు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం ఇసుక లోడుతో ట్రాక్టర్ ఊసనివానిపేట రైల్వేగేట్ నుంచి బీఆర్ నగర్ వైపు వస్తుండగా ద్విచక్ర వాహనంపై కృష్ణ మెట్టక్కివలసలోని కుప్పిలివారి వీధిలో నివాసం ఉంటున్న తన స్వగృహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు గాయాలు కాగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలు కాగా జరజాన కృష్ణపై నుంచి ట్రాక్టర్ వెళ్లపోవడంతో తీ వ్ర రక్తసావ్రమై అక్కడే పడిపోవడంతో స్థానికులు హుటాహుటిన జెమ్స్ ఆసుపత్రికి తరలిం చారు. మృతుడు కృష్ణ కామేశ్వరిపేటలో రైల్వేట్రాక్‌మెన్‌గా విధలు నిర్వహి స్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి..
ఆమదాలవలస, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్ పరిధి ఆమదాల వలస గేటు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకా కుళం రూరల్ మండలం నైర పచాయతీ చల్లపేట గ్రామానికి చెందిన కరి మెల్ల సూరిబాబు (55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణం లో పనిచేస్తున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఏం జరిగిందనే విషయం తెలియరాలేదన్నారు. కుటుంబ సభ్యుల కోసం సమాచారం సేకరిస్తున్నా మని, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించామన్నారు.