Share News

నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఎంజీఆర్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:44 PM

నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఎంజీఆర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం విలేక రులతో మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్లు, వసతిగృహాల నిర్మాణం, తాగు నీటి సరఫరా తదితర అభివృద్ధి పనుల కోసం రూ.400 కోట్లు మంజూరు చేయించామన్నారు. రానున్న కాలంలో గిరిజన గూడల్లో డోలీ మోతలు లేకుండా చర్యలు తీసు కుంటున్నామన్నారు. ప్రతీ గ్రామానికి రోడ్లు నిర్మిస్తామన్నారు. ఐటీడీఏ ఏర్పాటుతో గిరిపుతల అభివృద్ధి, జీవనోపాధి పెంపుదల, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఉద్దానం ఫేజ్‌-2కు సుమారు రూ.260 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీంతో గ్రామాలలో తాగునీటి సమస్య తీరనుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సలాన మోహనరావు, పైల బాబ్జీ, మెండ మనోహర్‌, ఒమ్మి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:44 PM