Share News

ఎక్కువ పనిచేస్తున్నా తక్కువ కూలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:30 PM

: తాము ప్రతి రోజూ రెండు పూటలా మం డుటెండలో ఎక్కువగా పనిచేస్తున్నా,తక్కువ కూలి వస్తోందని హిరమండలం, చిన్న కోరాడ, సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన వేతనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు.

  ఎక్కువ పనిచేస్తున్నా తక్కువ కూలి
ఉపాధి కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వేతనదారులు:

హిరమండలం, మార్చి27(ఆంధ్రజ్యోతి): తాము ప్రతి రోజూ రెండు పూటలా మం డుటెండలో ఎక్కువగా పనిచేస్తున్నా,తక్కువ కూలి వస్తోందని హిరమండలం, చిన్న కోరాడ, సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన వేతనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు. వీరంతా కొండరాగోలు సమీపంలోని ఎర్రచెరువులో ఆరురోజులుగా చెరువు పను లు చేస్తున్నారు.ఉదయం,సాయంత్రం రెండుపూటల పనిచేస్తున్నా ఆరు రోజుల పని దినాలకు మస్తర్లలో ఐదురోజులకు పనినమోదుచేసి రూ.600 మాత్రమే వేతనం చెల్లి స్తున్నారని వాపోయారు. ఈమేరకు గురువారం హిరమండలం ఉపాధిహామీ పథకం కార్యాలయం వద్ద రెండు వందల మంది వేతనదారులు నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజూ రెండు పూటలా కష్టపడి పనిచేస్తే వంద రూ పాయలే వస్తోందని, ఈ మొత్తం రవాణా చార్జీలకే సరిపోవడంలేదని వాపోయారు. ఆరు కిలోమీటర్లు ఆటోపైవెళ్లి పనులు చేస్తున్న తమకు తక్కువ వేతనం రావడంపై ఏపీఎం శ్రీనివాసరావును నిలదీశారు. పనికి కొలతలు మేర మాత్రమే వేతనం చెల్లిస్తామని ఏపీఎం శ్రీనివాసరావు తెలిపారు. వేతనదారులు ప్రభుత్వ నిబంధనలు మేరకు సమయానికి పనికి వెళ్లడంలేదని చెప్పారు.

Updated Date - Mar 27 , 2025 | 11:30 PM