Share News

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

ABN , Publish Date - Feb 09 , 2025 | 01:08 PM

Vishnukumar Raju: అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు.

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు
Vishnukumar Raju

విశాఖపట్నo: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ ఊహల్లో విహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెటైర్లు గుప్పించారు. జగన్ మానసిక సమస్యతో బాధపడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ...వైఎస్ జగన్ వైసీపీకి , అధ్యక్షులుగా ఉన్నంతకాలం కూటమికి భయం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు.


కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఏపీలో జగన్, ఉన్నంతవరకు.. ఇక్కడ కూటమికి, అక్కడ బీజేపీకి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మాటలు సినిమాల్లో సరిపోతాయని.. నిజ జీవితంలో ఇలాంటి మాటలు సూట్ కావని చెప్పారు. అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు. భవిష్యత్తులో కూటమికి విజయాలే వస్తాయని.. వైసీపీ ఇంకా అపజేయాలను మూటగట్టుకుంటుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు

హైదరాబాద్‌.. వైద్య రాజధాని

జీతం అడిగితే.. విషం తాగి చావమన్నారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 01:19 PM