Share News

Pregnant in Dolly డోలీలో గర్భిణి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:02 AM

Pregnant in Dolly గిరిశిఖర గ్రామ వాసులకు డోలీమోతలు తప్పడం లేదు. మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడుకు చెందిన గర్భిణి సోముల బొడెమ్మకు పురిటినొప్పులు రావడంతో అమె కుటుంబ సభ్యులు సోమవారం డోలీ సిద్ధం చేశారు.

Pregnant in Dolly డోలీలో గర్భిణి

డోలీలో గర్భిణి

శృంగవరపుకోట రూరల్‌ ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామ వాసులకు డోలీమోతలు తప్పడం లేదు. మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడుకు చెందిన గర్భిణి సోముల బొడెమ్మకు పురిటినొప్పులు రావడంతో అమె కుటుంబ సభ్యులు సోమవారం డోలీ సిద్ధం చేశారు. కొండ శిఖరం నుంచి మైదాన ప్రాంతం వరకు మోసుకుంటూ వెళ్లారు. ఇలా పది కిలోమీటర్లు నడిచాక బొడ్డవరకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌.కోట ఆస్పత్రిలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Updated Date - Apr 08 , 2025 | 12:02 AM