Share News

మూడు ఏఎంసీ చైర్మన్‌ పదవులు భర్తీ

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:29 AM

జిల్లాలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు ఆగ్రికల్చరల్‌ మార్కె ట్‌ యార్డు చైర్మన్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది.

మూడు ఏఎంసీ చైర్మన్‌ పదవులు భర్తీ

ఏలూరు – పార్థసారథి,

దెందులూరు – గారపాటి రామసీత, ఉంగుటూరు– కాలేటి జ్యోతి నియామకం

ఏలూరు టూటౌన్‌/పెదపాడు/ఉంగుటూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు ఆగ్రికల్చరల్‌ మార్కె ట్‌ యార్డు చైర్మన్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఏలూరు ఆగ్రికల్చరల్‌ మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత మామిళ్లపల్లి పార్థసారథి నియమితులయ్యారు. టీడీపీకి గత ఇరవై ఏళ్లుగా సేవలు చేస్తున్న ఆయన సేవలను ఎమ్మెల్యే బడేటి చంటి గుర్తిస్తూ ఏఎంసీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేశారు. 2009 నుంచి పార్థ సారఽథి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జి విజయం వెనుక కీలక పాత్ర పోషించారు. ఇటీవల 2024 ఎన్నికల్లోను బడేటి చంటి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి కృషి చేశారు. గతంలో బడేటి బుజ్జి హయాంలోనే ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావాల్సి ఉండగా కొన్ని సమీకరణాల వల్ల అప్పట్లో పదవి చేజారింది. కాగా ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నికైన పార్థసారఽథిని పలువురు అభినందించారు.

దెందులూరు నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్‌ గా పెదపాడు మండలం కొక్కిరపాడు పంచా యతీ వేంపాడుకు చెందిన గారపాటి రామసీత నియమితులయ్యారు. ఈమె 2006–2011 వరకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభు త్వంలో జడ్పీటీసీగా పనిచేశారు. అదే సమ యంలో రామసీత తల్లి ముల్పూరి ప్రసునాం బ ఏపూరు సర్పంచిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రామసీతను ప్రభుత్వం ఏఎంసీ చైర్మ న్‌గా నియమించడం పట్ల కూటమి నాయకు లు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం, ఎమ్మె ల్యే చింతమనేని నాపై నమ్మకం ఉంచి ఏఎంసీ చైర్మన్‌గా నియమించడం నా బాధ్యతను మరింత పెంచింది. ఏఎంసీ అభివృద్ధి నావంతు కృషి చేస్తా’అని ఆమె తెలిపారు.

ఉంగుటూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఉంగుటూ రు చెందిన సూరత్తు అయ్యప్ప (రాఘవ) భార్య కాలేటి జ్యోతికి అవకాశం దక్కింది. దీంతో జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను బీసీ మహిళకే కేటా యించారు. కాగా జడ్పీటీసీగా పోటీ చేసి ఓట మి చెందిన చింతల శ్రీనివాసు భార్య రాజే శ్వ రికి చైర్మన్‌ పదవి దక్కుతుందని ఆశించారు. అయితే పదవి దక్కకపోవడంతో టీడీపీ కేడర్‌ అసంతృప్తికి గురయ్యారు.

Updated Date - Mar 29 , 2025 | 12:30 AM