YSRCP Social Media Leader : వర్రా రవీంద్రరెడ్డికి బెయిల్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:08 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న...

కడప క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డికి బెయిల్ మంజూరైంది. దాదాపు 17 కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రాకు ఇప్పటికే 15 కేసుల్లో బెయిల్ లభించగా, మిగిలిన రెండు కేసుల్లో శనివారం బెయిల్ వచ్చింది. ఈ మేరకు తమకు సమాచారం వచ్చిందని కడప కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపారు. రవీంద్రరెడ్డి ప్రస్తుతం జగ్గయ్యపేట జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు.