Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:03 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. కాగా, వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు గురించి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు.
వచ్చే వారం పార్లమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఆ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అలాగే పట్టణంలో నివసిస్తున్న పేదల కోసం రూ.30 పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.