Share News

EPFO: చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనూ అదే వడ్డీ..

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:24 PM

ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2024- 25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఖరారు చేశారు. గత ఏడాది వడ్డీ రేటును కొనసాగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది.

EPFO: చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనూ అదే వడ్డీ..
EPFO

ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2024- 25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఖరారు చేశారు. 8.25% వడ్డీ రేటును కొనసాగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వడ్డీ రేటును నిర్ణయించేందుకు EPFO ట్రస్టీలు శుక్రవారం సమావేశమయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటునే ఈ ఏడాదీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


పాత వడ్డీ రేటునే కొనసాగించడంపై అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్, బాండ్ల దిగుబడి నుంచి EPFO ఆదాయం తగ్గడంతో పాటూ క్లెయిమ్‌లను ఎక్కువగా పరిష్కడం ఇందుకు కారణమని చర్చించుకుంటున్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో EPF చందాదారులకు 8.15% వడ్డీని అందించిన EPFO.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.25% కు పెంచిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 28 , 2025 | 12:57 PM