Gold and Silver Prices Today: గుడ్ న్యూస్ చెప్పిన బులియన్ మార్కెట్.. బంగారం, వెండి ధరలు ఇవే..
ABN , Publish Date - Feb 20 , 2025 | 07:05 AM
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలను పైపైకి తీసుకెళ్లాయి. అయితే నేడు (20-02-2025) గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది.

బిజినెస్ డెస్క్: కొన్ని రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ (గురువారం) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలను పైపైకి తీసుకెళ్లాయి. అయితే నేడు (20-02-2025) గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి బులియన్ మార్కెట్ (https://bullions.co.in/) ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే రూ.210 తగ్గి నేడు రూ.78,623కు చేరుకుంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.230 తగ్గి రూ.85,770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.79,099 ఉండగా.. ఇవాళ రూ.220 తగ్గి రూ.78,879కు చేరింది. అలాగే 24 క్యారెట్ల ధర నిన్న రూ.86,290 ఉండగా.. రూ.240 తగ్గి రూ.86,050కు చేరింది.
వెండి ధరల పరిస్థితి ఎలా ఉందంటే..
ఇక, వెండి విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర బుధవారం రూ.97,000 ఉండగా.. నేడు రూ.96,480కు తగ్గింది. ముంబైలో కేజీ వెండి నిన్న రూ.97,170 ఉండగా.. గురువారం రూ.96,650కు చేరుకుంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నిన్న రూ.97,320 ఉన్న వెండి ధర నేడు రూ.96,800కు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
పుణె- రూ.78,751, రూ.85,910
భోపాల్- రూ.78,833, రూ.86,000
భువనేశ్వర్- రూ.78,778, రూ.85,940
తిరువనంతపురం-రూ.78,998, రూ.86,180
జైపూర్- రూ.78,742, రూ.85,900
పట్నా- రూ.78,714, రూ.85,870
ముంబై- రూ.78,751, రూ.85,910
చెన్నై- రూ.78,980, రూ.86,160
బెంగళూరు- రూ.78,815, రూ.85,980
కోల్‌కతా- రూ.78,650, రూ.85,800
ఈ వార్తలు కూడా చదవండి:
భారత ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు