Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:49 PM
మీరు మీ ఆధార్ వివరాలను మార్పు చేసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆధార్ అప్‌డేట్ విషయంలో కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే మీ వివరాలు ఎప్పటికీ మారకుండా అలాగే ఉంటాయి. దీనికోసం ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ప్రస్తుతం భారతీయులకు ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే దీనిని తీసుకుని పదేళ్లు దాటిన వారు సహా ఆధార్‌లో తప్పులు ఉన్న వారు కూడా సరిదిద్దుకోవాలని ఫ్రీ ఛాన్స్ ఇచ్చారు. గతంలో దీని గడువు డిసెంబర్ 14, 2024 వరకు ఉండగా, ఇటివల జూన్ 14, 2025 వరకు పొడిగించారు. దీంతో మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ (Aadhaar update) చేసుకునేందుకు జూన్ వరకు సమయం ఉంది.
కానీ అప్‌డేట్ చేసుకునే విషయంలో మాత్రం కొన్ని తప్పులు చేయోద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆధార్ అడ్రస్, పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలను మార్పు చేసుకునే విషయంలో పరిమితి ఉందని చెబుతున్నారు. ఈ పరిమితి దాటితే మార్పు చేసుకునేందుకు మళ్లీ ఛాన్స్ ఉండదని అంటున్నారు.
ఒకసారి మాత్రమే
ఈ క్రమంలో మీరు ఆధార్‌లో పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక పుట్టిన తేదీని అయితే, ఒకసారి మాత్రమే మార్పుకునే ఛాన్సుంది. మరోవైపు ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. మీరు మీ ఆధార్ అప్‌డేట్ చేసుకునే విషయంలో వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే తెలియకుండా మీరు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఒకసారికి మించి మార్చుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు కాకుండా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మరిన్ని మార్పులు అవసరమైతే, మీరు UIDAI ప్రాంతీయ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. వారు అనుమతి ఇస్తే మార్పు చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్...
ఇక ఫోటో మార్పు విషయానికి వస్తే, ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి, ఎటువంటి పరిమితి లేదు. కానీ సాధారణంగా దీనిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అయితే ప్రతి మార్పునకు సరైన విధానాన్ని అనుసరించాలి. ఫోటోతో పాటు, మీరు మీ మొబైల్ నంబర్‌ను కూడా మీకు కావలసినన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు బయోమెట్రిక్ వివరాలు (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్), మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. మిగతా వివరాలను మీరు ఇంటి వద్దనే ఉండి ఆన్‌లైన్ ద్వారా ఈజీగా మార్చుకునే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News