Share News

యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:44 AM

దేశంలో యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి రూ.1500 కోట్ల విలువ గల ఒక పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీని కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో...

యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం

న్యూఢిల్లీ: దేశంలో యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి రూ.1500 కోట్ల విలువ గల ఒక పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీని కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొనుగోలుదారుడు వ్యాపారికి చెల్లించే రూ.2,000 లోపు మొత్తంపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ను (ఎండీఆర్‌) కేంద్రమే భరిస్తుంది. వ్యక్తిగత కొనుగోలుదారులు, వ్యాపారుల మధ్య (పీ2ఎం) తక్కువ విలువ గల భీమ్‌-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు జరిగే రూ.2,000 లోపు విలువ గల పీ2ఎం యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - Mar 20 , 2025 | 04:27 AM

News Hub