Share News

మరో పదేళ్లలో రూ.2.2 లక్షల కోట్ల స్థాయికి..

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:41 AM

కాంట్రాక్ట్‌ పద్దతిలో జరిగే పరిశోధన, అభివృద్ది, తయారీ (సీఆర్‌డీఎంఓ) విభాగాల్లో భారత ఔషధ పరిశ్రమకు మంచి భవిష్యత్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ సీఆర్‌డీఎంఓ...

మరో పదేళ్లలో రూ.2.2 లక్షల కోట్ల స్థాయికి..

  • భారత సీఆర్‌డీఎంఓ మార్కెట్‌పై బీసీజీ గ్రూప్‌ అంచనా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కాంట్రాక్ట్‌ పద్దతిలో జరిగే పరిశోధన, అభివృద్ది, తయారీ (సీఆర్‌డీఎంఓ) విభాగాల్లో భారత ఔషధ పరిశ్రమకు మంచి భవిష్యత్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ సీఆర్‌డీఎంఓ మార్కెట్‌ పరిమాణం 14,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇందులో భారత్‌ వాటా 2 నుంచి 3 శాతం మాత్రమే. అయితే ప్రస్తుతం భారత సీఆర్‌డీఎంఓ మార్కెట్‌ ఏటా సగటున 15 శాతం చొప్పున పెరుగుతోంది. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే 2035 నాటికి భారత సీఆర్‌డీఎంఓ మార్కెట్‌ 2,200 కోట్ల డాలర్ల నుంచి 2,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.2 లక్షల కోట్లు) స్థాయికి చేరే అవకాశం ఉందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) ఒక నివేదికలో తెలిపింది. తక్కువ ఖర్చుతో చిన్నచిన్న మాలిక్యూల్స్‌ అభివృద్ధి, సరికొత్త బయోలాజిక్స్‌ అభివృద్ధి చేయడంలో భారత కంపెనీలకు ఉన్న సామర్ధ్యం ఇందుకు కలిసి వస్తుందని బీసీజీ అంచనా.


పశ్చిమ దేశాల ఫార్మా కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల కోసం చేస్తున్న అన్వేషణ కూడా భారత సీఆర్‌డీఎంఓ కంపెనీలకు 1,000 కోట్ల డాలర్ల వ్యాపారం తెచ్చిపెట్టనుంది. యాంటీ డ్రగ్‌ కాంజుగేట్స్‌ (ఏడీసీ), డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ చికిత్సా విధానాలు, సీఆర్‌డీఎంఓ ప్రోత్సాహం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.25,000 కోట్ల ప్రత్యేక నిధి ఇందుకు మరింత దోహదం చేస్తాయని బీసీజీ పేర్కొంది.


Updated Date - Feb 26 , 2025 | 05:41 AM