Share News

Chennai: ప్రేమించలేదని టీచర్‌ కిడ్నాప్‌..

ABN , Publish Date - Feb 22 , 2025 | 08:16 AM

టీచర్‌ను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరునల్వేలి(Tirunelveli) జిల్లాలో ఓ ప్రాంతానికి చెందిన రాజా ఓ సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు.

Chennai: ప్రేమించలేదని టీచర్‌ కిడ్నాప్‌..

చెన్నై: టీచర్‌ను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరునల్వేలి(Tirunelveli) జిల్లాలో ఓ ప్రాంతానికి చెందిన రాజా ఓ సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 24 ఏళ్ల టీచర్‌తో రాజా(Raja)కు పరిచయం ఏర్పడి తరచూ మాట్లాడుకొనేవారు. ఈ క్రమంలో, ఆ టీచర్‌ మరో ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోవడంతో ఆమె రాజాతో మాట్లాడడం తగ్గించింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: హిందీని వ్యతిరేకిస్తూ తమిళనాడు అంతటా పోస్టర్లు..


ఆమెతో మాట్లాడాలని రాజా యత్నించగా ఆమె నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, గురువారం సాయంత్రం ఆమె బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కారులో వచ్చిన రాజా, తాను ఇంటికే వెళ్తున్నట్లు, తనతో రావాలని కోరాడు. అతను మాటలు నమ్మి ఆమె కారులో ఎక్కగా, అతను కన్నియాకుమరి(Kanniyakumari) వైపు కారు తిప్పడంతో అనుమానించిన ఆమె పెద్దగా కేకలు వేసింది.


nani4.jpg

ఆ సమయంలో ఆమెపై రాజా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌, లైంగిక వేధింపులు తదితర సెక్ష్లన్లపై కేసు నమోదుచేసిన పోలీసులు రాజాను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2025 | 08:16 AM