Share News

బాల్యానికి బయోస్కోపులా.. మాలిమిగా.. లాలనగా..

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:44 AM

‘నామంకోపు’ అని తెల్లగా వేలెడంత ఉండేది. రాత్రిపూట దాన్ని నీటితో అరగదీసి నా చిన్నప్పుడు రెండు కళ్లచుట్టూ పూసేది మా అమ్మమ్మ. ఎందుకని అడిగితే కళ్లకి చలవ నాయనా అని చెప్పేది. తొలకరి మట్టి వాసనతో, కళ్లచుట్టూ చల్లని తడితో...

బాల్యానికి బయోస్కోపులా.. మాలిమిగా.. లాలనగా..

‘నామంకోపు’ అని తెల్లగా వేలెడంత ఉండేది. రాత్రిపూట దాన్ని నీటితో అరగదీసి నా చిన్నప్పుడు రెండు కళ్లచుట్టూ పూసేది మా అమ్మమ్మ. ఎందుకని అడిగితే కళ్లకి చలవ నాయనా అని చెప్పేది. తొలకరి మట్టి వాసనతో, కళ్లచుట్టూ చల్లని తడితో, గాంధీ కళ్ళద్దాలు పెట్టుకున్నట్టుండే ముఖాల్ని అద్దంలో చూసుకుని నవ్వుకొనేది పిల్లలం. అలాగ రాత్రిళ్ళు నామంకోపు కళ్లతో ఉన్న చిన్నప్పటి నేనే ఈ కవిత ప్రారంభంలో అందమైన అమాయకపు ప్రశ్న వేసిన ‘పిచ్చి కన్నా’ అనిపిస్తుంది నాకు.

కరెంటు పోయి కొవ్వొత్తి వెలిగిస్తున్న అమ్మ పిల్లవాడి ప్రశ్నకు చిన్న కథ చెబుతుంది. (నా చిన్నప్పుడు బడి దగ్గరకి ఎవరో బయోస్కోపు తెచ్చేవాళ్లు. దానిలో రంగురంగుల బొమ్మలు ఒకదాని తర్వాత ఒకటి మారిపోతుంటే ఓ కన్ను మూసి మరో కంటితో చూసేవాళ్లం. అచ్చంగా అలా ఉంటుంది ఈ కథ. పాఠకుడ్ని ‘పసివాడ్ని’ చేసి చెబుతున్నప్పుడు అచ్చంగా అలానే ఉండాలి కథ). కథలో ఆకుల్ని కప్పుకొనే పిట్టల నుంచి పగటినీ రాత్రినీ మార్చి మార్చి కప్పుకొనే భూమి వరకూ ప్రతి ఒక్కటీ నేనే అనిపించి ఉద్వేగం కలుగుతుంది.

‘‘నీకు ముందు, నీ తర్వాత, నీకోసం, ఇంత గొలుసుకట్టు ప్రపంచం ఉండాలి నీ ఇంట్లో, లోకంలో, నీలో – అదే నీకు రక్షణ, భద్రత – అదే నిన్ను ప్రేమించే అందరి నుంచి నువ్వు పొందుకుంటోంది, తిరిగి వాళ్లందరికీ నువ్వు ఇవ్వాల్సింది’’ అనే జీవిత సత్యాన్ని ‘పసిబిడ్డ భాషలో’ మాలిమిగా, లాలనగా అమ్మలాగా చెబుతుంటే ఉద్వేగం కలగకుండా ఎలా ఉంటుంది?


చివరికి నిద్రలేమితో ఏళ్లకేళ్లు తీసుకున్నవాడిగా ఆఖరి మూడు వరుసల్లో కథలోనివన్నీ గంధపు వదనంపైన తెరలు తెరలుగా కదలాడుతుండగా అలా నోరు తెరుచుకుని నిదురపోయి ఉండేదీ నేనే...

ఐదేళ్ల క్రితం తొలిసారి చదివిన నాటి నుండి నేటి వరకు ఈ కవిత ఎప్పుడు మదిలో మెదిలినా ఇవే నాకు కలిగే బయోస్కోపు భావనలు, నేను ప్రేమని పొందుతున్న ప్రతి ఒక్కరిపైనా కృతజ్ఞతల్ని కాపాడుతున్న బతుకు తీపి వరాలు.

సొలోమోన్ విజయ్ కుమార్

83413 36828

ఇవి కూడా చదవండి..

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 03:44 AM