Bangladesh: యుద్ధానికి సిద్ధంగా ఉండండి: మహ్మద్ యూనస్ పిలుపు
ABN , Publish Date - Jan 05 , 2025 | 09:11 PM
Bangladesh: యుద్ధనికి సన్నద్దంగా ఉండాలని సైన్యానికి బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. చిట్టిగంగ్‌లో జరుగుతోన్న సైనిక విన్యాసాలను ఆయన ఆదివారం పరిశీలించారు.
ఢాకా, జనవరి 05: యుద్ధానికి సిద్దంగా ఉండాలని బంగ్లాదేశ్ సైన్యానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ పిలుపు నిచ్చారు. ఆదివారం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో సైనిక విన్యాసాలను ఆయన పరిశీలించారు. అనంతరం సైనికాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహమూద్ ఖాన్, నేవల్ ఫోర్స్ చీఫ్ అడ్మిరల్ ఎం నజ్ముల్ హసన్ తదితరులు తాత్కాలిక చీఫ్ యూనస్ వెంట ఉన్నారు.
యుద్ధానికి తమ సైన్యం ఎల్లప్పుడు సిద్ధంగా ఉందన్నారు. రాజ్ బరీ మిలటరీ ట్రైనింగ్ ఏరియాలో 55వ పదాతిదళ విభాగంతో ఆయన మాట్లాడుతూ.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని, యుద్ధంలో గెలవాలంటే సన్నద్ధత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడల్లో కనిపించే విధంగా... మరింత కష్టపడి పని చేసే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయన్నారు.
దేశ సైన్యంపై విశ్వాసంతోపాటు నమ్మకం పెరిగిందన్నారు. బంగ్లాదేశ్ సైన్యం మరింత ఆధునికంగా పని చేసేలా చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విన్యాసాలలో సైనికాధికారుల నైపుణ్యాన్ని ఈ సందర్భంగా మహమ్మద్ యూనస్ అభినందించారు. ఈ విన్యాసాలకు చాలా కృషి, ప్రణాళికతోపాటు సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా సైనిక అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విన్యాసాలకు తనను ఆహ్వానించినందుకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మరోవైపు గత కొద్ది నెలలుగా.. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతు వస్తుంది. ఆ దేశ ఛాందసవాద నేతలతోపాటు బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ చీఫ్ వరకు ఒకరి తర్వాత ఒకరుగా బెదిరింపులకు దిగుతున్నారు. భారత్‌లోని పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశాతోపాటు ఈశాన్య రాష్ట్రాలు సైతం కబ్జా చేసేలా వారు వరుస ప్రకటనలు గుప్పిస్తున్న విషయం విధితమే.
గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త ఆందోళనలు, నిరసనలకు పిలుపు నిచ్చాయి. వాటికి ప్రజల మద్దతు సైతం తోడైంది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆ కొద్ది రోజులకే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఒక తాటిపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో షేక్ హసీనా.. తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో తలదాచుకున్నారు.
Also Read: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం
Also Read: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
Also Read: ప్రభుత్వంపై స్వామీజీల ధర్మాగ్రహం.. డిక్లరేషన్
Also Read: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
Also Read: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే
Also Read :సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
అనంతరం బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది. అయితే షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. దీనిపై భారత్ వైపు నుంచి స్పందన లేదు. ఇక బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గంభీర పరిస్థితులు నెలకొన్నాయి.
For International News And Telugu News