Share News

Air Ambulances: రోడ్డుపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యే ఎయిర్‌ అంబులెన్స్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:10 AM

దేశంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్న నేపథ్యంలో ఆ ఆటంకాలను అధిగమించేలా ఏ మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడికైనా రోడ్డుపై (ఆన్‌-రోడ్‌) నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యే ‘ఎయిర్‌ అంబులెన్స్‌’లు త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి.

Air Ambulances: రోడ్డుపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యే ఎయిర్‌ అంబులెన్స్‌

ఐసీఏటీటీతో ఈప్లేన్‌ కంపెనీ 8,700 కోట్ల డీల్‌

788 వాహనాల సరఫరాకు ఒప్పందం

త్వరలో దేశంలోని అన్ని జిల్లాల్లో మోహరింపు

2026 చివరికి సేవలు ప్రారంభమయ్యే చాన్స్‌!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మనిషి ప్రాణం చాలా విలువైనది! ప్రమాదానికి గురైన సమయంలో లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు వారిని సకాలంలో ఆస్పత్రులకు చేరవేయడంలో అంబులెన్స్‌లది కీలక పాత్ర!! అయితే పట్టణాలు, నగరాల్లో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా కొన్నిసార్లు అంబులెన్స్‌లు ఆ రద్దీలో చిక్కుకొని, ముందుకు వెళ్లేందుకు దారిలేక.. పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్న నేపథ్యంలో ఆ ఆటంకాలను అధిగమించేలా ఏ మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడికైనా రోడ్డుపై (ఆన్‌-రోడ్‌) నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యే ‘ఎయిర్‌ అంబులెన్స్‌’లు త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి.

తద్వారా ఈ తరహా అంబులెన్స్‌లను ప్రారంభించిన ప్రపంచంలోని కొద్ది దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. దీంతో రోగులను, ప్రమాద బాధితులను వాయు మార్గంలో అత్యంత వేగంగా ఆస్పత్రులకు చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఐఐటీ మద్రాస్‌ కేంద్రంగా పనిచేసే ‘ఈప్లేన్‌ కంపెనీ’ అనే ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టార్టప్‌ దేశంలో ప్రముఖ ఎయిర్‌ అంబులెన్స్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ క్రిటికల్‌-కేర్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ఫర్‌ టీమ్‌ (ఐసీఏటీటీ)తో 100 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.8,700 కోట్లు) ఒప్పందం చేసుకుంది.

vfghj.jpg

దీని ప్రకారం ఆ సంస్థ 788 ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అఫ్‌ ల్యాండింగ్‌ (ఈవీటీవోఎల్‌) ఎయిర్‌ అంబులెన్స్‌లను సరఫరా చేయనున్నది. వీటిని దేశంలోని ప్రతి జిల్లాలో మోహరించనున్నారు. నమోదిత గ్రహీతల్లో దాదాపు 95 శాతం మంది సకాలంలో అవయవాలు పొందక మరణిస్తున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలో అవయవాలు, ఔషధాలను తరలించేందుకు ఇవి ఉపయుక్తం కానున్నాయి.

2026 చివరకు అందుబాటులోకి!

2026 చివరి త్రైమాసికం నాటికి ఎయిర్‌ అంబులెన్స్‌ల కార్యకలాపాలు ప్రారంభించాలని ఈప్లేన్‌ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తమ సంస్థకు ఏడాదికి 100 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని కంపెనీ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి పేర్కొన్నారు. చక్రవర్తి ఐఐటీ మద్రా్‌సలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఎయిర్‌ అంబులెన్స్‌ల ఒప్పందం పూర్తయినప్పటికీ, ఇతర రకాల ఈవీటీవోఎల్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టలను తయారు చేసేందుకు, పరీక్షించేందుకు, అవసరమైన సర్టిఫికేషన్‌ పొందేందుకు మరో 10 కోట్ల డాలర్ల నిధులను ఆయన ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఈప్లేన్‌ కంపెనీ 2 కోట్ల డాలర్ల మేర పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఈప్లేన్‌ కంపెనీ ప్రస్తుతం వివిఽధ రకాల భౌగోళిక పరిస్థితులు, జనాభా సాంద్రతల అవసరాల ఆధారంగా మూడు రకాల ఎయిర్‌ అంబులెన్స్‌ నమూనాలపై పనిచేస్తోంది. ఈ అంబులెన్స్‌లో ఒక పైలట్‌, ఒక పారామెడిక్‌, స్ట్రెచ్చర్‌ ఉంటాయి. ఇంకా రోగికి అత్యవసర సమయంలో అవసరమైన వైద్య పరికరాలు, మెడికల్‌ కిట్లు ఇందులో ఉండేలా తయారు చేయనున్నారు. గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి బ్యాటరీ రీచార్జ్‌ చేస్తే 100-200 కిలోమీటర్ల దూరంగా వరకు వెళ్లగలవు.

ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 05:10 AM