WTO: డబ్ల్యూటీవోకు నిధులు నిలిపివేసిన అమెరికా
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:10 AM
ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీవో) అమెరికా నుంచి వెళ్లే నిధులను నిలిపివేసినట్లు ట్రేడ్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీవో) అమెరికా నుంచి వెళ్లే నిధులను నిలిపివేసినట్లు ట్రేడ్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ప్రభుత్వ వ్యయాలను తగ్గించుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా పలు ప్రపంచ సంస్థల నుంచి తప్పుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 2024లో డబ్ల్యూటీవో వార్షిక బడ్జెట్ 23.2 కోట్ల డాలర్ల బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అమెరికా 11ు నిధులు సమకూరుస్తుంది. కాగా, స్వదేశంలో కోడిగుడ్ల ధరలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ప్రపంచ వ్యాప్తంగా వాటి అన్వేషణలో పడింది! జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్వీడన్ తదితర దేశాలను అమెరికా వ్యవసాయ శాఖ తమకు అర్జెంటుగా గుడ్లను సరఫరా చేయాలని కోరింది. కాగా అమెరికాలో బర్డ్ ఫ్లూ ప్రబలడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని యూరోపియన్ పరిశ్రమల వర్గాలు తెలిపాయి.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..