Share News

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:38 AM

కోల్‌కతా: బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది.

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Earthquake in Bay of Bengal

కోల్‌కతా: బంగాళాఖాతం(Bay of Bengal)లో భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం 06:10 గంటలకు బే ఆఫ్ బెంగాల్‌లో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం కోల్‌కతా (Kolkata) సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.


సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. కోల్‌కతా సమీపంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మరోవైపు దీని ప్రభావం ఒడిశా రాష్ట్రంపైనా పడింది. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Yogi Adityanath: కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్య

Kumbh Mela: ఆటవిక రాజ్యం తెచ్చినోళ్లు మన నమ్మకాలను గౌరవిస్తారా?

Updated Date - Feb 25 , 2025 | 08:25 AM