Share News

KSRTC bus conductor: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య తిరగని సర్వీసులు

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:53 AM

కండక్టర్‌పై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకుంటున్నట్టు బాలిక తల్లి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం బాలిక తల్లి ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

KSRTC bus conductor: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య తిరగని సర్వీసులు

బెంగళూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కేఎ్‌సఆర్టీసీ బస్సు కండక్టర్‌ మరాఠీలో మాట్లాడలేదని జరిగిన దాడి నేపథ్యంతో మూడోరోజు మంగళవారం కూడా మహారాష్ట్ర, కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఘటనపై కన్నడ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కాగా, కండక్టర్‌పై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకుంటున్నట్టు బాలిక తల్లి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం బాలిక తల్లి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాము కన్నడిగులమేననీ, కన్నడ అంటే అభిమానమని, కండక్టర్‌పై ఫిర్యాదు కన్నడ, మరాఠా వివాదంగా మారిందన్నారు. కండక్టర్‌ మహదేవప్పపై చేసిన ఫిర్యాదును వాపసు తీసుకుంటున్నామన్నారు. టిక్కెట్‌ కొనుగోలు విషయంలో గొడవ జరిగిందనీ, అది భాషా సమస్యగా మారిందన్నారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:53 AM