IPL 2025: కోహ్లీపై ధోని DRS అప్పీల్.. రివ్యూ ఏమైందో తెలుసా, ఫ్యాన్స్ ఫిదా..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:42 PM
ఐపీఎల్ 2025లో ఈరోజు 8వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు (RCB) మధ్య జరుగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, ధోనీ మధ్య ఓ క్రేజీ సంఘటన చోటుచేసుకుంది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచులో అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఎంఎస్ ధోని DRS (డిజిటల్ రివ్యూ సిస్టమ్) నైపుణ్యంతో ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో ఉండే ‘కెప్టెన్ కూల్’, ఈసారి మాత్రం మిస్సయ్యాడు.
చెపాక్‌లో జరుగుతున్న ఈ థ్రిల్లింగ్ మ్యాచులో ధోని తీసుకున్న ఓ DRS రివ్యూ మాత్రం విఫలమైంది. దీంతో ఇది అతని అపూర్వమైన ట్రాక్ రికార్డ్‌కు భంగం కలిగించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఇదే సమయంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు అభిమానులు ధోని DRS ఫెయిలైందని కామెంట్లు చేశారు.
చిన్న చర్చ తర్వాత
మూడో ఓవర్‌లో ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ తన ప్యాడ్స్‌పై ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో బౌలర్ ఖలీల్ అహ్మద్ LBW కోసం క్లైమ్ చేసాడు. అయితే, ఈ సంఘటనలో అంపైర్ కోహ్లీని అవుట్ అని నిర్ణయించలేదు. కానీ ధోని వచ్చి ఒక చిన్న చర్చ చేసిన తర్వాత, రుతురాజ్ గైక్వాడ్‌కు DRS రివ్యూ తీసుకోవాలని సూచించాడు. ఆ క్రమంలో వీడియో రీప్లే చూసినప్పుడు, బంతి లెగ్-స్టంప్ నుంచి బయటికు వెళ్లినట్లు కనపడింది.
దీంతో CSK తన మొదటి రివ్యూలో ఫెయిలైంది. ఈ అనూహ్య పరిణామంతో విరాట్ కోహ్లీ అభిమానులు ఓ వైపు స్టేడియంలో సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈసారి ధోనీ రివ్యూ సిస్టమ్‌కు చెక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఆప్షన్ ఎంచుకున్నాడు.
స్కోర్ ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా 31 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో రజత్ పాటిదార్ (50), జితేష్ శర్మ (12) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News