Share News

Delhi: ‘శీష్‌ మహల్‌’పై విచారణకు కేంద్రం ఆదేశం

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:34 AM

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం గురి పెట్టింది. కేజ్రీవాల్‌ హయాంలో ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టిన విషయం తెలిసిందే.

Delhi: ‘శీష్‌ మహల్‌’పై విచారణకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం గురి పెట్టింది. కేజ్రీవాల్‌ హయాంలో ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, శీష్‌ మహల్‌(అద్దాల మేడ)ను నిర్మించుకున్నారని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో సదరు భవనం పునర్నిర్మాణంపై ప్రాధమిక పరిశీలన చేసిన సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నెల 13న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. భవన నిర్మాణ విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి విచారణ కు కేంద్రం ఆదేశించింది.

Updated Date - Feb 16 , 2025 | 05:34 AM