Share News

Cyber Fraud : ‘వీసీ’ డిజిటల్‌ అరెస్టు.. రూ.14 లక్షలు వసూలు

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:10 AM

డిజిటల్‌ అరెస్టు సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి ఒడిశాలోని బెర్హంపూర్‌ ఉపకులపతి గీతాంజలి దాస్‌ రూ.14 లక్షలు కోల్పోయారు.

Cyber Fraud : ‘వీసీ’ డిజిటల్‌ అరెస్టు.. రూ.14 లక్షలు వసూలు

బెర్హంపూర్‌, ఫిబ్రవరి 26: డిజిటల్‌ అరెస్టు సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి ఒడిశాలోని బెర్హంపూర్‌ ఉపకులపతి గీతాంజలి దాస్‌ రూ.14 లక్షలు కోల్పోయారు. ఫిబ్రవరి 12న ఘటన చోటుచేసుకోగా, మోసపోయామని గుర్తించిన సదరు వీసీ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. గీతాంజలికి ఫిబ్రవరి 12న ఈడీ అధికారిని అని చెప్పుకొని ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఆమె పేరుతో ఉన్న ఓ బ్యాంకు ఖాతాలో రూ.కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోందని, ఆ క్రమంలోనే డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని సదరు వ్యక్తి నమ్మబలికాడు. ఆమె ఖాతాలను ఆడిట్‌ చేస్తున్నామని చెప్పి.. గీతాంజలి అకౌంట్‌లో ఉన్న రూ.14 లక్షలను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు.

Updated Date - Feb 27 , 2025 | 06:10 AM