Share News

Delhi Assembly elections: మహిళలకు రూ.2.500.. ప్రకటించిన కాంగ్రెస్

ABN , Publish Date - Jan 06 , 2025 | 02:40 PM

కర్ణాటక మోడల్ తరహాలోనే 'ప్యారీ దీదీ' పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని డీకే శివకుమార్ చెప్పారు.

Delhi Assembly elections: మహిళలకు రూ.2.500.. ప్రకటించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం "ప్యారీ దీదీ యోజన'' (Pyari Didi Yojana)ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఈ పథకాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కర్ణాటక మోడల్ తరహాలోనే 'ప్యారీ దీదీ' పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని డీకే చెప్పారు.

HMPV Cases India: దేశంలో 3 హెచ్‌ఎంపీవీ కేసులు.. బెంగళూరు తర్వాత..


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో పార్టీలన్నీ ప్రధానంగా మహిళా పథకాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన' కీలక పాత్ర పోషించినట్టు రాజకీయ విశ్లేషకులు తేల్చిచెప్పారు.


కాంగ్రెస్‌పై పెరుగుతున్న నమ్మకం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండటంతో ప్రజల్లోనూ నమ్మకం పెరిగినట్టు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖాండ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏవైతే వాగ్దానాలు చేశామో వాటన్నింటిని అమలు చేశామని, ప్రజావిశ్వాసాన్ని పొందగలిగామని చెప్పారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కలల్లో విహరిస్తుంటారని, 11 ఏళ్లుగా ఢిల్లీ పరిస్థితి దిగజారిందని, ఎడ్యుకేషన్ మోడల్, ఉచిత విద్యుత్, ఉచిత నీళ్లు, అవినీతిని అంతం చేయడం వంటి హామీలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నాయి. ఢిల్లీలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 60 సీట్లలో ఆప్ గెలుపొందగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి..

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 02:40 PM