Share News

Supreme Court: ఆయన మంత్రిగా కొనసాగడం అవసరమా..

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:44 PM

సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా కొనసాగాలా అనే విషయమై అఫిడివిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. చట్టవ్యతిరేకంగా నగదు బట్వాడా కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన సెంథిల్‌ బాలాజి, 417 రోజుల అనంతరం బెయిలుపై విడుదలయ్యారు.

Supreme Court: ఆయన మంత్రిగా కొనసాగడం అవసరమా..

- కేసులో 200 మంది సాక్షులు

- ప్రశ్నించిన సుప్రీంకోర్టు

చెన్నై: సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా కొనసాగాలా అనే విషయమై అఫిడివిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. చట్టవ్యతిరేకంగా నగదు బట్వాడా కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన సెంథిల్‌ బాలాజి, 417 రోజుల అనంతరం బెయిలుపై విడుదలయ్యారు. విడుదలై మరుసటిరోజే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా సెంథిల్‌ బాలాజి బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై(Chennai)కి చెందిన విద్యాకుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ వార్తను కూడా చదవండి: నా ప్రేమను హేళన చేయడంతో హత్య చేశా..


మంత్రి పదవిలో లేననే కారణంతో బెయిలు పొందిన ఆయన, మరుసటిరోజే మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, దిగువ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేఫథ్యంలో, విచారణకు అడ్డంకులు సృష్టించే అవకాశముందని, అందువల్ల ఆయన బెయిలు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ గతంలో విచారించిన న్యాయమూర్తులు, సెంథిల్‌ బాలాజీకి వ్యతిరేకంగా ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో, ఈ పిటిషన్‌ బుధవారం మళ్లీ విచారణకు రాగా... సెంథిల్‌ బాలాజీకి బెయిలు రాక ముందు ఈ కేసులో విచారణ జరిపిన ఫోరెన్సిక్‌ నిపుణుడు ఇప్పుడు గైర్హాజరయ్యారని, ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉండడంతో నిపుణుడు భయంతో విచారణకు హాజరుకాలేదని, అందువల్ల సెంథిల్‌ బాలాజీ బెయిలు రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం న్యాయవాది వాదించారు.

nani3.2.jpg


సెంథిల్‌ బాలాజి మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అంత అవసరం ఎందుకని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్ష్యులుగా ఉన్న నేపథ్యంలో, ఆయన మంత్రిగా ఉంటే ఏం జరుగుతుంది? సెంథిల్‌ బాలాజి మంత్రిగా కొనసాగాలా? అనే విషయం ఆయన తరఫు వివరణ చెప్పండి. అలా ఆయన మంత్రిగా కొనసాగే పక్షంలో, ప్రాధాన్యత ఆధారంగా విచారణ జరిపించవచ్చంటూ, తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదావేశారు.


ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర

ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2025 | 12:44 PM