Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:34 PM
హోలీ పండుగ వేళ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రమాదం ఎయిర్ బ్యాగ్స్ కారణంగా జరిగిందని డ్రైవింగ్ చేసిన యువకుడు చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

గుజరాత్ వడోదర(Vadodara)లో ఇటీవల జరిగిన ఒక భయానక రోడ్డు ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 ఏళ్ల యువకుడు రక్షిత్ చౌరాసియా, గురువారం అర్ధరాత్రి తన కారుతో ఐదుగురిని ఢీకొట్టాడు. కానీ అతను తాను తాగలేదని, ప్రమాదానికి అసలు కారణం ఎయిర్‌బ్యాగ్స్ అనడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అతని వాదన ఎంతవరకు నిజమో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రమాదానికి ముందు ఏమైంది..
పోలీసుల కథనం ప్రకారం రక్షిత్ చౌరాసియా, అతని స్నేహితుడు మీట్ చౌహాన్‌తో కలిసి రాత్రి కారులో ప్రయాణించారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో కరేలిబాగ్ ప్రాంతంలో అతని కారు రెండు స్కూటర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమాని పటేల్ అనే మహిళ కూడా ఉంది. ఆమె తన కుమార్తెతో కలిసి హోలీ రంగులు కొనడానికి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నేను తాగలేదు.. వేగం కూడా లేదు
ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన రక్షిత్, తాను మద్యం సేవించలేదని, మాదకద్రవ్యాలు తీసుకోలేదని పేర్కొన్నాడు. అతను, “నా కారు గంటకు 50 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లినట్లు చెప్పాడు. ఒక కూడలికి సమీపంలో ఓ గుంతను తప్పించేందుకు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. కానీ ఆ సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో నా వ్యూయింగ్ స్పేస్ బ్లాక్ అయిన క్రమంలో, ప్రమాదం జరిగిందన్నాడు. అయితే, ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు మత్రం మరోలా అనిపిస్తున్నాయి.వీడియోలో, అతను వేగంగా కారును నడుపుతూ, స్కూటర్లను ఢీకొట్టిన అనంతరం “ఇంకో రౌండ్” అని అరుస్తూ కనిపించాడు.
పోలీసుల విచారణ
పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సీనియర్ అధికారి పన్నా మోమయ మాట్లాడుతూ, “చౌరాసియా తన కారును గంటకు 120 కి.మీ. వేగంతో నడిపాడు. మద్యం సేవించి ఉన్నాడని మొదట అనుమానం ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల ద్వారా పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. పోలీసులు అతనితో పాటు, కారును అతనికి ఇచ్చిన స్నేహితుడు మీట్ చౌహాన్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎయిర్‌బ్యాగ్ నిజంగా ప్రమాదానికి కారణమా..
రక్షిత్ చౌరాసియా చెప్పినట్టు, ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగిందా? అసలు, ఎయిర్‌బ్యాగ్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తెరుచుకుంటుంది. అంటే, కారుకు కఠినమైన దెబ్బ తగిలినపుడే అది యాక్టివేట్ అవుతుంది. అంటే, ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడానికి ముందు ప్రమాదం జరిగి ఉండాల్సిందే. పైగా, డ్రైవర్ ఎప్పుడూ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వాహనం నడపాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదంలో పూర్తి విషయాలు విచారణలో తేలనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ISIS Global Chief: ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ హతం..ట్రంప్ పనేనా..
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..
Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..
Read More Business News and Latest Telugu News