Liquor Ban: 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపులు క్లోజ్
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:18 AM
ఈ మేరకు శుక్రవారం భోపాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం మోహన్ యాదవ్ మీడియాకు తెలిపారు. ‘‘ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 పట్టణాలలోని మద్యం షాపులను పూర్తిగా మూసివేస్తున్నాం.

కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
భోపాల్, జనవరి 24: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 పట్టణాలలోని మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం భోపాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం మోహన్ యాదవ్ మీడియాకు తెలిపారు. ‘‘ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 పట్టణాలలోని మద్యం షాపులను పూర్తిగా మూసివేస్తున్నాం. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడం లేదు. ఉజ్జయిని నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజలకు మంచి పాలన అందించడానికి ప్రయత్నిస్తున్నాం.
ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది’’ అని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధ లక్ష్యానికి ఇది తొలిఅడుగని బీజేపీ నేతలు కొనియాడారు. మద్యం షాపులు బంద్ కానున్న ఆధ్యాత్మిక నగరాలు.... లింగా, పన్నా, ధటియా, మాండ్లా, ముల్తాయి, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, చిత్రకూట్, అమర్‌కంటక్, కుండల్‌పుర్, మంద్‌సౌర్, బర్మన్ కలా, ఓర్ఛా, మైహర్, బందక్ పుర్, బర్మన్ ఖర్ద్.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News