Manipur Governor: 7 రోజుల్లోగా ఆయుధాలతో లొంగిపోవాలి.. గవర్నర్ ఆదేశం..
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:57 PM
ఈరోజు నుంచి ఏడు రోజుల్లోపు అక్రమంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో వచ్చి లొంగిపోవాలని మణిపూర్ గవర్నర్ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఎందుకు అలా చెప్పారు. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మణిపూర్(Manipur)లో శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Ajay Kumar Bhalla) ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే దోచుకున్న అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వారం రోజుల్లోగా తిరిగి ఇచ్చి, లొంగిపోవాలని గురువారం గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల్లోపు లోయ, కొండ ప్రాంతాల యువత స్వచ్ఛందంగా వచ్చి చట్టవిరుద్ధంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమీపంలోని పోలీస్ స్టేషన్ పోస్ట్ లేదా భద్రతా దళాలకు అందించాలని సూచించారు.
శాంతి యుతంగా..
మణిపూర్‌లో ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌లో గత 20 నెలలుగా రెండు జాతుల మధ్య కొనసాగుతున్న వైరం కారణంగా అనేక మంది మరణించారు. ఈ పరిస్థితి సీఎం రాజీనామా చేసే వరకు వెళ్లగా, ఇప్పుడు దీనిని తగ్గించేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని శాంతి యుతంగా పరిష్కరించుకోవడానికి, యువత భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అన్నారు. మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం కలిసి పనిచేయాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు
మణిపూర్‌లో దాదాపు రెండేళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మెయిటీ, కుకి జో వర్గాల మధ్య జరిగిన హింస తరువాత రాష్ట్రంలో చాలా కాలం పాటు కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో అనేక మంది పోలీసులు, భద్రతా దళాల నుంచి పలువురు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకున్నారు. అవి వారి దగ్గర ఉన్న కారణంగా హింస మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మెయిటీ, కుకి జో గ్రూపుల మధ్య జరిగిన జాతి హింసలో 250 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి:
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News