Share News

US immigration: 23 నెలల్లో 92 లక్షల మంది!

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:44 AM

యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) గణాంకాల ప్రకారం 2022 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు మధ్య 23 నెలల వ్యవధిలో 92 లక్షల మందికి పైగా అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు.

US immigration: 23 నెలల్లో 92 లక్షల మంది!

అమెరికాలో అక్రమ ప్రవేశాలకు యత్నం

వీరిలో 2.7 లక్షల మంది భారతీయులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) పరిధిలోని యూఎస్‌ బోర్డర్‌ అండ్‌ కస్టమ్స్‌ పెట్రోల్‌ (యూఎ్‌సబీపీ), యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) గణాంకాల ప్రకారం 2022 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు మధ్య 23 నెలల వ్యవధిలో 92 లక్షల మందికి పైగా అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో సరిహద్దుల్లో అరెస్టయినవారు, బహిష్కరణకు గురైనవారు, ప్రవేశానికి అనుమతి నిరాకరించిన వారు ఉన్నారు. 2021 నుంచి 2024 వరకూ మొత్తం 3,488 మంది భారతీయులను ఐసీపీ అరెస్టు చేసింది. మరోవైపు 2022 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 2,69,884 మంది భారతీయులను యూఎ్‌సబీపీ అడ్డుకుంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 04:44 AM