Rhea Chakraborty: నిందను మోసి నిరపరాధిగా
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:51 AM
రియా చక్రవర్తి పై నిందలూ, అనేక కేసులూ పెరిగినప్పటికీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ రియా innocence ని నిర్ధారించింది. నాలుగున్నర సంవత్సరాల విచారణ అనంతరం ఆమెకు న్యాయవిభాగం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు, రియా బాలీవుడ్‌లో తిరిగి అవకాశాలు పొందవచ్చా? కాలమే చెబుతుంది.

‘‘పది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు’’ అనేది సహజ న్యాయ సూత్రాల్లో ప్రధానమైనది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కేసులో ఈ న్యాయసూత్రం గెలిచిందనిపిస్తుంది. నాలుగున్నరేళ్ల క్రితం ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా ప్రధాన నిందితురాలు. ఆమెను విలన్‌గా పేర్కొంటూ సోషల్ మీడియాలో కొన్ని వేల వీడియోలు సుడిగాలిలా వ్యాపించాయి. ‘‘నా తప్పు లేదు..’’ అని ఆమె ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. నాలుగున్నరేళ్ల విచారణ తర్వాత- సీబీఐ ఈ కేసులో రియా తప్పు లేదని తేల్చింది. దీనితో మళ్లీ మరోసారి ఆమె వార్తల్లో వ్యక్తి అయింది. ఇన్ని సంచలనాలకు కారణమైన రియా కథేమిటంటే...
బాలీవుడ్‌లో అవకాశాలు కోసం ముంబాయికి ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. అలాంటి వారిలో రియా కూడా ఒకరు. రియా తండ్రి ఆర్మీలో లెఫ్టెనెంట్ కల్నల్‌గా పనిచేసేవారు. ఆర్మీ నేపథ్యం ఉంది కాబట్టి ఆమె దేశంలోని అనేక ప్రాంతాల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న రియా... 2009లో ‘ఎంటీవీ- టీవీఎస్ స్కూటీ టీన్ దీవా’ అనే కార్యక్రమానికి యాంకర్‌గా ఎంపికయింది. ఆ తర్వాతి కాలంలో కొన్ని మోడలింగ్, వీడియో జాకీ (వీజే) అవకాశాలు లభించాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం ప్రవేశం దొరకలేదు. అయితే 2012లో తెలుగులో ‘తూనీగ... తూనీగ’ సినిమాలో హీరోయిన్ అవకాశం లభించింది.
ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు మొదయలయ్యాయి. కానీ అగ్రశ్రేణి నటిగా మాత్రం ఎదగలేకపోయింది. ఈ నేపథ్యంలో... అప్పుడప్పుడే బాలీవుడ్‌లో ఎదుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆరునెలలలోనే వారిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. రియా తమ్ముడు షవిక్‌తో కలిసి సుశాంత్‌సింగ్- ‘ వివిడ్ రేజ్ రిహాలిటిక్స్’ అనే ఒక స్టార్ట్‌పను కూడా ప్రారంభించాడు. అంతా సజావుగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో - 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త దేశాన్ని కుదిపేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటానికి ఒక వారం ముందే రియా వేరుగా వెళ్లిపోయిందని, సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసింది ఆమే అనీ రకరకాల వార్తలు వ్యాపించాయి. ఆ తర్వాత సుశాంత్ తండ్రి... తన కుమారుడి మరణానికి రియా కారణమని పోలీసు కేసు పెట్టారు. కొన్ని రోజులకే దాన్ని సీబీఐకి బదిలీ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ), ఈడీలతో కలిపి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయటం మొదలుపెట్టింది. దీనికి బదులుగా రియా కూడా సుశాంత్ సోదరీమణులు ప్రియాంక, మీతూ సింగ్‌లపై కేసులు పెట్టింది. సుశాంత్ మరణానికి దారి తీసిన పరిస్థితులకు వీరిద్దరే కారణమని ఈ కేసుల్లో పేర్కొంది.
అల్లకల్లోలం...
ఒక వైపు ఈ కేసుల్లో దర్యాప్తు జరుగుతుండగానే- మరో వైపు రియాను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. దీనితో రియాపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమయింది. ఒక వైపు జైల ు.. మరో వైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌లతో ఆమె జీవితం అతలాకుతలమైపోయింది. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలన్నీ మాయమైపోయాయి. ఈ సమయంలో రియాకు ఆమె కుటుంబమే అండగా నిలబడింది. ‘‘అలాంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు మాట మాట్లాడినా ఆమె జీవితంలో పెనుమార్పులు వస్తాయి. అందుకే రియా కుటుంబం మౌనంగా ఉండి.. ఆమెకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె కూడా చాలా ధైర్యంగా పోరాడింది’’ అంటారు సుప్రీంకోర్డు సీనియర్ న్యాయవాది సతీష్ మణిషిండే.
వాన వెలిసి...
కొద్దికాలం తర్వాత కోర్టులో రియాకు బెయిల్ లభించింది. ‘ఎంటీవీ రోడ్డీ్‌స’లో ఆమెకు మళ్లీ అవకాశం వచ్చింది. ‘రియా- చాప్టర్ 2’ అనే పాడ్‌కా్‌స్టను కూడా ప్రారంభించింది. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. ఈ సోమవారం రియాకు క్లీన్‌చిట్ ఇస్తూ... కోర్టులో సీబీఐ పిటిషన్ ఫైల్ చేసింది. దీనితో ఈ కేసు నుంచి రియాకు పూర్తిగా విముక్తి లభించినట్టయింది. గత ఆరేళ్లుగా న్యాయపోరాటాలతోనే కాలం గడిపిన ఆమెకు ఇకనైనా బాలీవుడ్‌లో అవకాశాలు లభిస్తాయో లేదో కాలమే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
IPL 2025: పంజాబ్ సూపర్ కింగ్స్‌లో పవర్‌ఫుల్ హిట్టర్ల లిస్ట్ చుశారా..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News