Share News

Boosting Kids Energy: రోజంతా ఉల్లాసంగా

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:09 AM

పిల్లలు రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను పాటించాలి. ఎనిమిది గంటల నిద్ర, వ్యాయామం, పోషకాహారం, శారీరక ఆటలు మరియు ఆలోచన శక్తిని పెంచే ఆటలు పిల్లలలో చురుకుదనం, ఉత్సాహం పెంచుతాయి. పిల్లలను శాంతిగా, ధైర్యంగా ఉండటానికి ప్రోత్సహించండి.

Boosting Kids Energy: రోజంతా ఉల్లాసంగా

పిల్లలు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అందుకు తల్లిదండ్రులు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

  • పిల్లలకు కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అందుకే వాళ్లను రాత్రిపూట త్వరగా పడుకోబెట్టి ఉదయాన్నే నిద్ర లేపాలి. అప్పుడే వాళ్ల శరీరం, మెదడు విశ్రాంతి పొందుతాయి. పిల్లలు రోజంతా చురుకుగా ఉంటారు.

  • పెద్దలకే కాదు పిల్లలకు కూడా వ్యాయామం అత్యవసరం. రోజూ కనీసం 20 నిమిషాలపాటు ప్రాణాయామం, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటివి చేయించాలి. దీంతో శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

  • రోజూ పోషకాలతో నిండిన అల్పాహారం తినిపించాలి. దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఎదుగుతారు.

  • పిల్లల్లో చురుకుదనం, ఏకాగ్రత పెరగాలంటే శారీరక శ్రమతోపాటు ఆలోచన తీరుని మెరుగుపరచి, బుర్రకు పదునుపెట్టే ఆటలను ఆడించాలి. టెన్నిస్‌, చదరంగం, బాస్కెట్‌ బాల్‌, స్విమ్మింగ్‌, కరాటే లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. తోటివారితో ఆడుతూ ఉంటే పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు.


  • పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. వాళ్లను చిన్నచిన్న పనుల్లో భాగస్వాములను చేయాలి. ఒత్తిడి, ఆందోళన లేకుండా చదువుకునేలా ప్రోత్సహించాలి. పడుకునేముందు కథలు చెప్పాలి.

  • పిల్లలు ఏదైనా తప్పు చేసినా కోప్పడకుండా మెల్లగా వివరించి చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు నేర్పుగా పరిష్కరించుకునే విధానాలను తెలియజెప్పాలి. దీంతో పిల్లలు చిన్న విషయాలకే ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండగల్గుతారు.

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 02:40 AM