Share News

Effective Tips for Personal Hygiene and Health: అందంగా ఆరోగ్యంగా

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:51 AM

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడకపు వస్తువుల శుభ్రత మరియు పఠిత అలవాట్లపై దృష్టి పెట్టాలి. ఇవి ఆరోగ్య సమస్యలను నివారించి శరీరాన్ని శుభ్రంగా ఉంచే మార్గాలను సూచిస్తాయి.

Effective Tips for Personal Hygiene and Health: అందంగా ఆరోగ్యంగా

మంచి అలవాట్లతో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యమూ దరి చేరదు. అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు ఇవే.

  • చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సబ్బు లేదా హ్యాండ్‌ వాష్‌తో కనీసం ఇరవై సెకన్లు రుద్దుతూ కడుక్కోవాలి. అప్పుడే చేతులపై ఉండే హానికర బ్యాక్టీరియాలు, వైర్‌సలు నశిస్తాయి.

  • రోజుల తరబడి తువాళ్లను ఉతకకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. రెండు రోజులకు ఒకసారి తువాళ్లను ఉతకాలి. తడి తువాలుతో తుడుచుకోవడం కూడా మంచిది కాదు. ఒకసారి ఉపయోగించిన తరవాత తువాలును ఎండలో ఆరవేయాలి.

  • గోళ్లను వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి. గోళ్లలో మురికి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. గోళ్ల విషయంలో అశ్రద్ద కనబరిస్తే శరీరంలోకి హానికారక క్రిములు ప్రవేశిస్తాయి.

  • టూత్‌బ్ర్‌షలో కూడా హానికర బ్యాక్టీరియాలు చేరుతూ ఉంటాయి. కాబట్టి టూత్‌బ్ర్‌షను కనీసం మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేయాలి.

  • ముఖాన్ని చేతులతో పదేపదే తాకకూడదు. చేతుల మీద ఉండే క్రిములవల్ల ముఖంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడతాయి. రోజూ ముఖాన్ని సున్నిపిండితో రుద్ది చల్లని నీళ్లతో కడుక్కోవాలి.


  • మేకప్‌ కిట్స్‌, రేజర్లు, దువ్వెనలు, తువాళ్లు, చేతిరుమాళ్లు ఇతరులతో పంచుకోవద్దు. దీనివల్ల వ్యక్తిగత శుభ్రత మెరుగుపడుతుంది.

  • బజారు నుంచి తీసుకొచ్చిన పళ్లు, కూరగాయలను ఉప్పు, పసుపు వేసిన నీళ్లతో కడగడం మంచిది. దీనివల్ల వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, హానికారక క్రిములు నశిస్తాయి.

  • షూస్‌, చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. వారానికి ఒకసారి వీటిని శుభ్రం చేసుకోవాలి. సాక్స్‌ని ఉతకకుండా ధరించకూడదు. బకెట్‌ వేడి నీళ్లలో రెండు చెంచాల ఉప్పు, ఒక చెంచా పసుపు వేసి కలిపి అందులో పాదాలు ఉంచి అరగంట తరవాత సబ్బుతో రుద్ది కడుక్కుంటే పగుళ్లు, అలెర్జీలు దరి చేరవు.

ఇవి కూడా చదవండి:

Viral News: ప్రముఖ గాయకుడిపై రాళ్లు, సీసాలతో దాడి..స్పందించిన సింగర్

IPL Strategic Time-Out: ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక ఇంత రహస్యం దాగి ఉందా

CM Chandrababu: ఆ ప‌రిస్థితి రానీయొద్దు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Updated Date - Mar 26 , 2025 | 03:14 AM