Nara Bhuvaneshwari: మహిళలు మహా శక్తిగా ఎదగాలి
ABN, Publish Date - Mar 27 , 2025 | 04:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. 2వ రోజు పర్యటనలో భాగంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని, సహాయం కావాలని ప్రజలు ఇచ్చిన వినతులను భువనేశ్వరి స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు.

2వ రోజు పర్యటనలో భాగంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని, సహాయం కావాలని ప్రజలు ఇచ్చిన వినతులను భువనేశ్వరి స్వీకరించారు.

ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

వారు ఎదుర్కొంటున్న సమస్యలను భువనేశ్వరికి తెలిపారు.

కుప్పంలో ఇండియన్ బ్యాంకును నారా భువనేశ్వరి ప్రారంభించారు.

కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నారా భువనేశ్వరి

కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తున్న నారా భువనేశ్వరి

మహిళలు డబ్బులను దుబారా చేయకుండా వారి ఆర్థిక అభివృద్ధి కోసం పొదుపు చేసుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు.

కుప్పంలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణా కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు.

మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు అందిస్తున్న చేయూతతో మహా శక్తిగా ఎదగాలని నారా భువనేశ్వరి కోరారు.

కుప్పంలోని (కడ) మహిళా పారిశ్రామిక వేత్తల(ALEAP)తో సమావేశమయ్యారు. వారి ఆలోచనలు, ప్రణాళికలు తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను భువనేశ్వరికి తెలిపారు.

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని భువనేశ్వరి అన్నారు.

సమస్యలు వింటున్న నారా భువనేశ్వరి

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నారా భువనేశ్వరి చెప్పారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులు తెచ్చారని నారా భువనేశ్వరి గుర్తుచేశారు.

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారని నారా భువనేశ్వరి అన్నారు.

మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి మరువలేనిదని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని నారా భువనేశ్వరి తెలిపారు.
Updated at - Mar 27 , 2025 | 04:42 PM