Husband and wife: వామ్మో.. భార్య మీద ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఆ వ్యక్తి బైక్ డ్రైవింగ్ వెనుక కథేంటంటే..
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:09 AM
వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. చాలా చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి గొడవలు పడుతుంటారు. ఆ గొడవలు ముదిరితే ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అలా పగ తీర్చుకునే క్రమంలో ఎవరికీ ఊహకందని పనులు చేస్తుంటారు.

సాధారణంగా భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. చాలా చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి గొడవలు పడుతుంటారు. ఆ గొడవలు ముదిరితే ఒకరి మీద ఒకరు పగ (Revange) తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అలా పగ తీర్చుకునే క్రమంలో ఎవరికీ ఊహకందని పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని ఓ విచిత్రమైన పని చేశాడు. బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్‌లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. (Husband and Wife)
ముజఫర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత సంవత్సరం పాట్నాకు చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుంది. వివాహ సమయంలో వధువు తండ్రి వరుడికి ఒక బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ బైక్‌ను తన కూతురి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. అయితే వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహం జరిగిన 45 రోజులకే యువతి తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఆ వ్యక్తి తన భార్య మీద పగతో ఓ వింత పద్ధతిని అనుసరించాడు. తన భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న బైక్ మీద వెళ్తూ ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ప్రారంభించాడు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధిచన చలాన్ల మెసేజ్‌లు అతని భార్య నంబర్‌కు రావడం ప్రారంభమైంది. మొదట్లో ఆ మహిళ జరిమానాలు చెల్లించింది. కానీ చలాన్ల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. ఆ మహిళ బైక్‌ను తిరిగి ఇచ్చెయ్యమన్నప్పుడు అతడు నిరాకరించాడు. కోర్టులో విడాకులు వచ్చిన తర్వాతే బైక్ తిరిగి ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ పాట్నా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..