Viral: ఒంటరి మగాళ్లకు ఏఐ గర్ల్ ఫ్రెండ్! ధర చూస్తే షాక్ పక్కా!
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:15 PM
రియల్ బాట్రిక్స్ అనే అమెరికన్ సంస్థ రూపొందించి రోబో గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తుతం నెట్టింట సంచలనం రేకెత్తిస్తోంది. నిజమైన యువతుల ముఖకవళిలను ప్రతిబింబించగలుగుతున్న ఈ ఏఐని చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ పుణ్యమా అని ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలు ప్రస్తుతం వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఏఐ గర్ల్ ఫ్రెండ్ సంచలనంగా రేకెత్తిస్తోంది. లాస్ వేగస్‌లో ఇటీవల జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో రియల్ బాట్రిక్స్ అనే సంస్థ ఆరియా పేరిట ఏఐ రోబోను ఆవిష్కరించింది. ఒంటరి పురుషులకు తోడుగా ఉండేందుకు రూపొందించిన ఈ ఏఐ రోబోట్ ముఖకవళికలు అచ్చు మనుషులను పోలి ఉంటాయని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది (Viral).
మనుషులను పూర్తిస్థాయిలో పోలి ఉండేలా రోబోలను డిజైన్ చేయాలనే లక్ష్యంతో ఆరియాను రూపొందించినట్టు సంస్థ సీఈఓ ఆండ్రూ కిగ్యుల్ తెలిపారు. మగాళ్లల్లో ఒంటరి తనం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రోబోలను తెరమీదకు తెచ్చినట్టు పేర్కొన్నారు.
Viral: లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు.. లాటరీ సొమ్ముతో కొన్న ఇల్లు బుగ్గిపాలు!
‘‘మరెవరూ గతంలో చేయని స్థాయికి మేము రోబోల తయారీని తీసుకెళ్లదలిచాము. ఈ రోబోలు మీరెవరో గుర్తుపెట్టుకుంటుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌లా మాట్లాడుతుంది. సినిమాలోని పాత్రల్లో చూసినట్టు నిజజీవితంలో ఈ రోబోలను డిజైన్ చేస్తున్నాము’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మనుషులను పోలిన రోబోల అభివృద్ధికి సంబంధించి నడక, ముఖకవళికలే రెండు ప్రధానమైన అంశాలని పేర్కొన్నారు. బడా సంస్థలు రోబోల నడకను అభివృద్ధి చేస్తున్నాయమని, తమలాంటి సంస్థలు ముఖకవళికలపై దృష్టిపెట్టాయని ఆయన పేర్కొన్నారు.
LA Wild Fires: అమెరికాలో అడవులు తగలబడుతున్నా అదుపుతప్పని వాయు కాలుష్యం
కాగా, ఈ ఆవిష్కరణపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు మాత్రం ఏవగింపు వ్యక్తం చేశారు. ‘‘ఈ రోబోను చూసి మొదట షాకయ్యా. అచ్చు నిజమైన మనిషిలాగే అనిపించింది. ఎకడో చూసినట్టు ఉన్న భావన కలిగింది’’ అని ఓ వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఆందోళనకరమని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ఈ రోబో పక్కన నిలబడి ఎలా ఫొటో తీసుకొంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
కాగా, పారిశ్రామిక ఎగ్జిబిషన్‌కు వచ్చిన వారితో ఈ ఏఐ రోబో అద్భుతంగా సంభాషించిందని సంస్థ సీఈఓ కిగ్యూల్ పేర్కొన్నారు. మనుషులతో అర్థవంతమైన సంభాషణలు జరపడంలో ఈ రోబో ఆరితేరిపోయిందని చెప్పారు.
Viral: తన తండ్రికి ఉద్యోగం కోరుతూ యువతి అభ్యర్థన .. నెట్టింట ప్రశంసల వెల్లువ