Viral Video: హవ్వా.. నడిరోడ్డు మీద ఈ పనేంటి? జంక్షన్‌లో ఓ జంట రొమాన్స్ చూసి ఏం చేశారంటే..
ABN , Publish Date - Jan 22 , 2025 | 08:39 PM
జనాలను ఆకట్టుకునే విచిత్రమైన వీడియోలను రూపొందించేందుకు యువతీయువకులు భిన్నమైన దారులు తొక్కుతున్నారు. బహిరంగంగా చేయకూడని పనులు చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో విచిత్రమైన వీడియోలను (Strange Video) రూపొందించేందుకు యువతీయువకులు భిన్నమైన దారులు తొక్కుతున్నారు. బహిరంగంగా చేయకూడని పనులు చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పట్ట పగలు, నడిరోడ్డు మీద ఓ సిగ్నల్ పాయింట్ దగ్గర ఓ యువతి, ఓ యువకుడు న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సిగ్నల్ పడిన సమయంలో వారిద్దరూ రోడ్డు మీదకు చెరో వైపు నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నారు. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న వాహనదారులు వారిని ఆశ్చర్యకరంగా చూస్తుండిపోయారు. వాళ్లు ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ట్రాఫిక్ పోలీస్, చుట్టు పక్కల వారు వారి దగ్గరకు వచ్చారు. పక్కకు వెళ్లమని కేకలు వేశారు.
చుట్టు పక్కల వాళ్లు ఎంతలా అరుస్తున్నా, పోలీస్ వచ్చినా వారు మాత్రం కౌగిలించుకుని అలాగే నిలబడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రేమికులు ఇలాగే ప్రపంచాన్ని పట్టించుకోరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: కొంప ముంచిన పిల్లి.. చైనా మహిళ ఉద్యోగం ఊడింది.. బోనస్ పోయింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి