Viral Video: కేక్‌లో క్రాకర్ పెట్టాడు.. వెలిగించి అందరికీ షాకిచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:29 PM
చాలా మంది బర్త్ డే సందర్బంగా కేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. కేక్ పైన క్యాండిల్ పెట్టి దానిని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ క్యాండిల్‌ను ఆర్పి కేక్ కట్ చేస్తుంటారు. అయితే కేక్ మీద క్యాండిల్ కాకుండా క్రాకర్ పెడితే ఎలా ఉంటుంది? ఆ ఊహకే భయంగా ఉందా? తాజాగా ఓ కుర్రాడు అలాంటి పనే చేశాడు.

చాలా మంది బర్త్ డే (Birthday) సందర్బంగా కేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. కేక్ పైన క్యాండిల్ పెట్టి దానిని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ క్యాండిల్‌ను ఆర్పి కేక్ కట్ చేస్తుంటారు (Birthday Cake). అయితే కేక్ మీద క్యాండిల్ కాకుండా క్రాకర్ (Cracker) పెడితే ఎలా ఉంటుంది? ఆ ఊహకే భయంగా ఉందా? తాజాగా ఓ కుర్రాడు అలాంటి పనే చేశాడు. అలాంటి పిచ్చి పని చేసినందుకు తగిన మూల్యం చెల్లించాడు. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@sk465g అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు ఓ అమ్మాయి బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాడు. కేక్‌లో క్యాండిల్‌కు బదులుగా క్రాకర్‌ను పెట్టాడు. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్న అమ్మాయి ఆ క్రాకర్‌ను వెలిగించింది. ఆ క్రాకర్ నుంచి కొద్దిసేపు మంట ఎగిసి పడింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ క్రాకర్ పేలిపోయింది. దీంతో ఆ కేక్ ఆనవాళ్లు కూడా లేకుండా మొత్తం మాయమైపోయింది. అయితే చుట్టు పక్కల ఉన్న వారికి ఎలంటి గాయాలూ కాకపోవడం అదృష్టం.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వెయ్యి మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కేక్‌తో పాటు ఫైర్ క్రాకర్స్‌ను కూడా ఆర్డర్ చేసినట్టున్నారు``, ``ఇది బ్లాస్టింగ్ బర్త్‌డే``, ``కేక్‌ల మీద ఫైర్ క్రాకర్ పెట్టడం పిచ్చి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..